భారతదేశం, అక్టోబర్ 8 -- ఓటీటీలోకి తమిళ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ వచ్చేస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో, డిఫరెంట్ జోనర్లో వచ్చిన ఈ సినిమానే 'బాంబ్'. థియేటర్లలో పాజటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు 8.2 ఐఎండీబీ రేటింగ్ ఉంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు మూవీ రెడీ అయింది.

లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ 'బాంబ్' ఓటీటీలోకి రాబోతుంది. ఒకేసారి మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 10 నుంచి ఆహా తమిళ్ తో పాటు సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్ ఓటీటీల్లో బాంబ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఒకే సారి మూడు ఓటీటీల్లో రిలీజ్ అవుతుంది.

బాంబ్ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అర్జున్ దాస్, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 1...