భారతదేశం, జనవరి 30 -- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ వెబ్ సిరీస్ 'తడయం' (Thadayam). ఈ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. గతేడాది రేఖై, హార్టిలీ బ్యాటరీ, వేడువన్‌ వంటి సిరీస్‌లను అందించిన జీ5.. ఈ ఏడాది 'తడయం' అనే కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అర్ధరాత్రి హత్యలు చేసే కిల్లర్, అతన్ని పట్టుకోవడానికి సాగే వేట చుట్టూ తిరిగే కథ ఇది.

క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ తమిళ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5 (ZEE5) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. నవీన్ కుమార్ పళనివేల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సముద్రఖని పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఇంతకుముందే ఈ సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఆ ఓటీటీ తాజాగా శుక్రవారం (జనవరి 30) స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది. సముద్రఖనిలాంటి నటుడితో క...