Hyderabad, సెప్టెంబర్ 2 -- తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సరెండర్ (Surrender). ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో రిలీజైంది. నెల రోజుల తర్వాత ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. పోలీసులు, గ్యాంగ్‌స్టర్, మధ్యలో ఎలక్షన్స్ రచ్చ చుట్టూ తిరిగే సినిమా ఇది. దీనికి ఐఎండీబీలో 8.2 రేటింగ్ నమోదు కావడం విశేషం.

తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సరెండర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. గురువారం (సెప్టెంబర్ 4) నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సన్ నెక్ట్స్ ఓటీటీ మంగళవారం (సెప్టెంబర్ 2) వెల్లడించింది.

"ఓ సాధువులాంటి పోలీసు, ఓ క్రూరమైన గ్యాంగ్‌స్టర్, మరో మూడో వ్యక్తి ఢీకొన్నప్పుడు గందరగోళం మొదలవుతుంది. సరెండర్ సెప్టెంబర్ 4 నుంచి సన్ నెక్ట్స్ లో" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన చిన్న టీజర్ ను కూడా ట్వీట్ కు జత చేసింది.

సర...