భారతదేశం, అక్టోబర్ 28 -- ఓటీటీలోకి ఈవారం రానున్న ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ఓ తమిళ కామెడీ మూవీ కూడా ఉంది. ఈ సినిమా పేరు సొట్ట సొట్ట ననైయుతు (Sotta Sotta Nanaiyuthu). బట్ట తలతో బాధపడే ఓ యువకుడు ఎదుర్కొనే కష్టాలు, ఆత్యన్యూనత, బాడీ షేమింగ్ లాంటి అంశాల చుట్టూ తిరిగే మూవీ ఇది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

తమిళ కామెడీ మూవీ సొట్ట సొట్ట ననైయుతు మూవీ ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 31 నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. "అందరికీ సంబంధించిన మరో కథ వచ్చేస్తోంది ఫ్రెండ్స్.. సొట్ట సొట్ట ననైయుతు అక్టోబర్ 31న ఆహా తమిళంలో ప్రీమియర్ కానుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సొట్ట సొట్ట ననైయుతు ఓ తమిళ కామెడీ సినిమ...