భారతదేశం, జూలై 4 -- ఓటీటీల్లోకి ఈ వారం కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు దూసుకొచ్చాయి. థ్రిల్లర్, కామెడీ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు వివిధ భాషలకు చెందిన మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కు క్యూ కట్టాయి. ఇందులో భాగంగానే ఓ తమిళ్ ఫీల్ గుడ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మిడిల్ క్లాస్ స్టోరీని తీసుకున్న మనసుకు అల్లుకునే విధంగా మలచిన మూవీ 'మద్రాస్ మ్యాట్నీ' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

మద్రాస్ మ్యాట్నీ సినిమా ఒకే రోజు నాలుగు ఓటీటీల్లోకి వచ్చేసింది. ఈ తమిళ్ మూవీ ఈ రోజు (జూలై 4) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం ఓటీటీ ఫ్యాన్స్ కు అందుబాటులోకి వచ్చింది. ఒకే సారి నాలుగు ఓటీటీల్లో ఈ మూవీ రిలీజ్ కావడం విశేషం. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు టెంట్ కోట, సన్ నెక్స్ట్, సింప్లీ సౌత్ ఓటీటీలో మద్రాస్ మ్యాట్నీ సినిమా రిలీజైంది.

మనసును హత్తుకుని, హృద‌య...