భారతదేశం, నవంబర్ 23 -- వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ 'సన్నీ సంస్కారి కి తులసి కుమారి' ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ లేటెస్ట్ బాలీవుడ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా అక్టోబర్ 2, 2025న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ బాట పట్టనుంది.

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఆమె నటించిన రీసెంట్ మూవీ 'సన్నీ సంస్కారి కి తులసి కుమారి'. ఇందులో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సాన్యా మల్హోత్రా, రోహిత్ సరఫ్ తదితరులు నటించారు. ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ధర్మా ప్రొడక్షన్స్ నిర్మించి, శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన సన్నీ సంస్కారి కి తులసి కుమారి మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. బలమైన తారాగణం, మంచి ఓ...