భారతదేశం, నవంబర్ 14 -- జాన్వీ కపూర్ నటించిన మూవీ ఒకటి ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ దర్శకుడు నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన, విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ డ్రామా మూవీ 'హోమ్‌బౌండ్'. ఈ సినిమా నవంబర్ 21న డిజిటల్ ప్రీమియర్ కానుంది. సెప్టెంబర్ 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తర్వాత ఇండియా నుంచి ఆస్కార్స్ కు అధికారిక ఎంట్రీగా నిలిచింది. 98వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా ఎంపికైంది.

ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించిన మూవీ హోమ్‌బౌండ్. ఈ సినిమా సెప్టెంబర్ 26న థియేటర్లలో రిలీజ్ కాగా.. నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రఖ్యాత దర్శకుడు మార్టిన్ స్కోర్సెసే ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన 'హోమ్‌బౌండ్'.. నార్త్ ఇండియా నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా ఇద్దరు చిన్ననాటి స్నేహితులు.. మొహమ్మద్ ...