భారతదేశం, ఏప్రిల్ 19 -- బాలీవుడ్ స్టార్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రలో హై జనూన్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ మ్యూజికల్ డ్రామా సిరీస్‍లో నీల్ నితిన్ ముకేశ్ కూడా మరో లీడ్ రోల్ చేస్తున్నారు. అభిషేక్ శర్మ ఈ సిరీస్‍కు దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్, డ్యాన్స్ చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఈ హై జనూన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారైంది.

హై జనూన్ వెబ్ సిరీస్ మే 16వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. టీజర్ ద్వారా డేట్ కన్పర్మ్ చేసింది. మే 16 నుంచి హాట్‍స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ చూసేయవచ్చు.

టీజర్ ద్వారా హై జనూన్ స్టోరీలైన్‍పై క్లారిటీ వచ్చింది. ముంబైలోని అండర్సన్స్ కాలేజీ బ్యాక్‍డ్రాప్‍లో ఈ సిరీస్ సాగనుంది. కాలేజీలోని రెండు మ్యూజిక్ క్లబ్‍ల మధ్య పోటీతో ఈ సి...