భారతదేశం, జూలై 10 -- బిచ్చగాడి పాత్రలో ధనుష్, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నాగార్జున కలిసి అదరగొట్టిన సినిమా 'కుబేర'. ఈ మూవీ థియేటర్లలో సత్తాచాటింది. అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన కుబేర మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం త్వరలోనే ఆ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

సూపర్ హిట్ మూవీ కుబేర ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ ఓటీటీలోనే కుబేర మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రైమ్ వీడియో సుమారు రూ.50 కోట్లు ఖర్చు పెట్టిందన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల దుమ్ము రేపిన కుబేర ఓటీటీ రైట్స్ కోసం డిమాండ్ నెలకొన్నప్పటికీ ప్రైమ్ వీడియో హక్కులు ...