భారతదేశం, ఏప్రిల్ 27 -- టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన దిల్‍రూబా చిత్రం మంచి అంచనాలతో మార్చి 14న థియేటర్లలో విడుదలైంది. 'క' బ్లాక్‍బస్టర్ తర్వాతి చిత్రం కావడం, ఈ సినిమాపై కిరణ్ చాలా నమ్మకం వ్యక్తం చేయడంతో హైప్ పెరిగింది. కానీ దిల్‍రూబా మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకొని నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కాగా, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం వాయిదా పడింది.

దిల్‍రూబా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్‍కు తెచ్చేలా డీల్ జరిగిందని తెలిసింది. దీంతో ఈనెల ఏప్రిల్ రెండో వారం లేకపోతే మూడో వారంలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. డేట్‍లపై రూమర్లు వచ్చాయి. కానీ దిల్‍రూబా మాత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు ఇంక...