Hyderabad, మే 29 -- కన్నడ థ్రిల్లర్ సినిమాలకు మీరు అభిమానా? అయితే మిమ్మల్ని థ్రిల్ చేయడానికి ఇప్పుడో సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఎప్పుడో ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. వచ్చే నెలలో డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పేరు అధిపత్ర (Adhipatra).

ఓటీటీలోకి రాబోతున్న కన్నడ మర్డర్ మిస్టరీ మూవీ పేరు అధిపత్ర. అంటే వారెంట్ అని అర్థం. బిగ్ బాస్ కన్నడ సీజన్ 9 విన్నర్ అయిన రూపేష్ శెట్టి లీడ్ రోల్లో నటించిన మూవీ ఇది. అతడు తులు భాషలో డైరెక్టర్ గా సర్కస్ అనే మూవీ తీసిన తర్వాత నటించిన సినిమా ఈ అధిపత్ర. ఈ సినిమా డిజిటల్ హక్కులను సన్ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది. ఈ మూవీని జూన్ 13 నుంచి సన్ నెక్ట్స్‌ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.

రూపేష్ శెట్టి ఈ సినిమాలో ఆత్రేయ అనే పోలీస్ ఆఫీ...