భారతదేశం, జనవరి 15 -- మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని హీరోగా చూడటం అలవాటే. కానీ అతనిలోని భయానకమైన విలనిజాన్ని చూడాలంటే 'కలంకావల్' (Kalamkaval) చూడాల్సిందే. థియేటర్లలో ప్రేక్షకులను వెన్నులో వణుకు పుట్టించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది. సోనీ లివ్, ఓటీటీ ప్లే ప్రీమియం ద్వారా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

మమ్ముట్టి నటించిన కలంకావల్ సినిమా గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. సుమారు 40 రోజుల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్ కు వచ్చింది. నిజానికి ఈ సినిమాను జనవరి 16న (శుక్రవారం) ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

కానీ సినిమా కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తూ.. ఒక రోజు ముందే, అంటే ఈ రోజే (జనవరి 15) స్ట్రీమింగ్ మొదలుపెట్టారు. గతంలో 'రేఖాచిత్రం', 'మార్కో' సినిమాల విషయంలోనూ ఇలాగే జరి...