Hyderabad, ఏప్రిల్ 30 -- మలయాళ అడ్వెంచర్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నిజానికి గురువారం (మే 1) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే బుధవారం (ఏప్రిల్ 30) సాయంత్రం 5 గంటలకే డిజిటల్ ప్రీమియర్ అయింది. ఈ విషయాన్ని సోనీ లివ్ ఓటీటీ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన మలయాళ అడ్వెంచర్ కామెడీ మూవీ బ్రొమాన్స్ (Bromance). బాక్సాఫీస్ దగ్గర రూ.13.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ మూవీ సోనీ లివ్ ఓటీటీలో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

"గతంలో ఎన్నడూ చూడనటువంటి నవ్వుల రైట్ ప్రారంభమైంది. బ్రొమాన్స్ ఇప్పుడు సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో సోనీ లివ్ ఓటీటీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

ప్రతి సినిమాను చెప్పినదాని కంటే ఒక రోజు ముందే తీసుకురావడం ...