Hyderabad, మే 30 -- ఓటీటీలోకి తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. కంగువా వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ తర్వాత సూర్య నటించిన సినిమా ఇది. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్‌గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. సూర్య, పూజా హెగ్డే తొలిసారిగా జోడీ కట్టిన సినిమా ఇది.

అలాగే, రెట్రో మూవీలో మొదటిసారిగా పూజా హెగ్డే డీ గ్లామర్ లుక్‌లో కనిపించి అలరించింది. తమిళ పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు రెట్రో మూవీకి దర్శకత్వం వహించారు. అటు సూర్య, ఇటు పూజా హెగ్డేకు గత కొంతకాలంగా సరైన హిట్ లేదు. దీంతో ఈ ఇద్దరు కలిసి నటించిన రెట్రో మూవీపై విడుదల సమయంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మే డే సందర్భంగా మే 1న రెట్రో మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే, రెట్రో మూవీకి మిశ్రమ స్పందనలు వచ్చాయి. తమిళంలో మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది. త...