Hyderabad, మే 5 -- హారర్ మూవీ అభిమానులా మీరు? అయితే ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్న ఈ హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి. గతేడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజై ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకుపైగా వసూలు చేసిన సినిమా ఇది. కొన్నాళ్లుగా వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ మూవీ.. ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి రానుంది.

ఓటీటీలోకి వస్తున్న హారర్ మూవీ పేరు నోస్ఫెరాటు (Nosferatu). ఈ సినిమా మే 10 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. రాబర్ట్ ఎగర్స్ డైరెక్ట్ చేసిన ఈ నోస్ఫెరాటు సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ సాధించింది.

రూ.420 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తే.. రూ.1500 కోట్లు వసూలు చేసింది. బిల్ స్కార్స్‌గార్డ్, లిలీ రోజ్ డెప్, నికోలస్ హౌల్ట్, ఆరోన...