Hyderabad, సెప్టెంబర్ 9 -- మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మీషా (Meesha) సుమారు నెలన్నర రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఆరుగురు స్నేహితులు డిన్నర్ కోసం దట్టమైన అడవిలోకి వెళ్లి చిక్కుకుపోయే స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ పై ఆసక్తి నెలకొంది.

మీషా ఓ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. తెలుగులో దీనికి మీసాలు అని అర్థం. ఈ డిఫరెంట్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు కూడా ఆదరించారు. జులై 31న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 12) నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ మంగళవారం (సెప్టెంబర్ 9) వెల్లడించింది.

"యాక్షనా థ్రిల్లరా? రెండూ ఉన్నాయి.. మీషా సెప్టెంబర్ 12న ఆహా తమిళంలో ప్రీమియర్ కానుంది" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ ...