భారతదేశం, ఏప్రిల్ 23 -- బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్ మ‌లియ‌క్క‌ల్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్నారు. ఫ‌స్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేయ‌బోతున్నాడు. అది కూడా ఓ సీక్వెల్ వెబ్‌సిరీస్ కావ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఏడాది ఆహా ఓటీటీలో రిలీజైన వేరే లెవెల్ ఆఫీస్ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్ రాబోతుంది.

వేరే లెవెల్ ఆఫీస్ 2 టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. ఈ విష‌యాన్ని ఆహా ఓటీటీ ఆఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వెబ్‌సిరీస్‌లో లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న యాక్ట‌ర్ ఫేస్ మాత్రం రివీల్ చేయ‌లేదు. వీడియోలో అత‌డు వెన‌క్కి తిరిగి క‌నిపించాడు. ఆ యాక్ట‌ర్ ఎవ‌ర‌నే క్యూరియాసిటీని ఆడియెన్స్‌లో క‌లిగించ‌డం కోస‌మే వీడియోలో అత‌డి ఫేస్ చూపించ‌లేద‌ని స‌మాచారం.

కాగా ఆ యాక్ట‌ర్ బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 విన్న‌ర్ నిఖిల్ మ‌లియ‌క్క‌ల్ అన...