భారతదేశం, డిసెంబర్ 15 -- ప్రతివారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే, వాటిలో ఈ వారం చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్‌గా నాలుగు తెలుగు స్ట్రయిట్ సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి.

అందులో 3 ఒకే రోజు ఓటీటీ స్ట్రీమింగ్ కానుండగా.. హారర్, సైకో క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ, లవ్ ఎమోషనల్ జోనర్లలో సినిమాలు, సిరీస్‌లు ఉన్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

తెలుగులో రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమకథగా వచ్చిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి. న్యూ డైరెక్టర్ సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ ఉద్దెమారి, తేజస్విని రావు హీరో హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా క్లైమాక్స్ తెలుగు ఆడియెన్స్‌ను షాక్‌కు గురి చేసింది.

రస్టిక్ ట్రాజిక్ లవ్ స్టోరీగా, రియల్ ఇన్స...