Hyderabad, ఏప్రిల్ 24 -- ఓటీటీలోకి ప్రతివారం సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, వీటిలో ఎక్కువగా గురు, శుక్రవారాల్లో ఓటీటీ రిలీజెస్ అవుతుంటాయి. ఇవాళ (ఏప్రిల్ 24) కూడా ఓటీటీలోకి కొన్ని స్పెషల్ సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్న, వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన రీసెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ వీర ధీర శూరన్. రాయన్ ఫేమ్ దుషారా విజయన్ ఇందులో హీరోయిన్‌గా విక్రమ్‌ సరసన చేసింది. అలాగే, వీర ధీర శూరన్ సినిమాలో వర్సటైల్ యాక్టర్స్ ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు ఇతర కీలక పాత్రలు పోషించారు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించార...