Hyderabad, జూన్ 20 -- ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరే ఉంటుంది. అదనపు అంశాలు జోడించి పర్ఫెక్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. హారర్ మూవీస్‌ను యాక్షన్, కామెడీ, అడ్వెంచర్, సైకలాజికల్ వంటి ఎలిమెంట్స్‌ యాడ్ చేసి చిత్రీకరిస్తుంటారు.

అలా తెలుగులో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీనే ఘటికాచలం. బాల నటుడిగా పేరు తెచ్చుకున్న నిఖిల్ దేవాదుల హీరోగా మారిన సినిమానే ఘటికాచలం. నిజ జీవితంలో జరిగిన యదార్థ హారర్ ఘటనలతో ఘటికాచలం సినిమాను రూపొందించారు.

అమర్ కామెపల్లి దర్శకత్వం వహించిన ఘటికాచలం సినిమాలో నిఖిల్ దేవాదులతోపాటు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, సంజయ్ రాయ్ చుర, జోగి నాయుడు, దుర్గాదేవి, షాన్ కక్కర్, రంగధామ్, అర్జున్ విహాన్, శ్రీనివాస్ కామెపల్లి, సమ్యు రెడ్డి ఇతర కీలక పాత్రలు ...