Hyderabad, మే 12 -- నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో కల్యాణ్ రామ్‌కు తల్లిగా నటించిన ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీని అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు, ముప్పా వెంకట చౌదరి, కల్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరించారు. అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్, బబ్లూ పృథ్వీరాజ్, శ్రీరామ్, చరణ్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ గ్రాండ్ రిలీజ్ అయింది. సినిమా కథ రొటీన్‌గా ఉన్నప్పటికీ క్లైమాక్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉందని టాక్ వచ్చింది. అలాగే, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని, నందమూరి కల్యాణ్ రామ్ ఫైటింగ్ సీక్వెన్స్‌లో ఆకట...