భారతదేశం, డిసెంబర్ 11 -- థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీల్లో సినిమాలు అడుగుపెడుతుంటాయి. అయితే, ఈ ఓటీటీ రిలీజెస్ కొన్నిసార్లు అనౌన్స్‌మెంట్లతో, మంచి బజ్ క్రియేట్ చేస్తూ జరిగితే మరికొన్ని సార్లు చడీచప్పుడు లేకుండా సైలెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి.

అలా ఇవాళ (డిసెంబర్ 11) ఓటీటీలోకి సడెన్‌గా ఓ తెలుగు మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే 12ఏ రైల్వే కాలనీ. కామెడీ సినిమాలతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న అల్లరి నరేష్ సీరియస్ రోల్స్‌తో కూడా మెప్పించాడు. అయితే, గత కొంత కాలంగా అల్లరి నరేష్ సినిమాలు వర్కౌట్ కావట్లేదు.

నాంది తర్వాత అల్లరి నరేష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతంగా సక్సెస్ కావట్లేదు. అందులో ఒక సినిమానే 12ఏ రైల్వే కాలనీ. తెలుగులో హారర్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 12ఏ రైల్వే కాలనీ సినిమాలో హీరోయిన్‌గా పొలిమేర బ్యూటి కామాక్షి భా...