Hyderabad, ఏప్రిల్ 25 -- ఓటీటీలోకి ప్రతివారం ఎన్నో సరికొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే, వీటిలో ఎక్కువగా శుక్రవారం ఓటీటీ రిలీజెస్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు స్పెషల్ సినిమాలు ఉంటాయి. అలా ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాల్లో స్పెషల్‌గా సూపర్ హిట్ కామెడీ మూవీ ఒకటి ఉంది.

అదే మ్యాడ్ స్క్వేర్. 2023లో ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ హిట్ కొట్టిన సినిమా మ్యాడ్. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ముగ్గురు హీరోలుగా నటించిన మ్యాడ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

దాంతో మ్యాడ్ సీక్వెల్‌పై విపరీతమైన అంచనాలు పెరిగాయి. మ్యాడ్ సీక్వెల్ కోసం ఎంతగానే ప్రేక్షకులు ఎదురుచూశారు. ఇక వారి కోరిక మేరకు అన్నట్లుగానే మ్యాడ్ స్క్వేర్ అని రెండో భాగాన్ని ప్రకటించారు. అప్పటినుంచి మ్యాడ్ స్క్వేర్‌పై విప...