Hyderabad, సెప్టెంబర్ 11 -- ఓటీటీలోకి ఇవాళ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమాలో ఏకంగా నలుగురు హీరోలు నటించారు. అంతేకాకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 515 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఆ సినిమా, ఓటీటీ ప్లాట్‌ఫామ్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా పేరు కూలీ. సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటీ నలుగురు స్టార్ హీరోలు నటించిన కూలీ సినిమాకు ఖైదీ 2, విక్రమ్, లియో ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈ మూవీలో సౌబిన్ షాహిర్, సత్యరాజ్ వంటి పాపులర్ యాక్టర్స్ కూడా ఉన్నారు.

ఇవే కాకుండా బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్ ...