Hyderabad, ఏప్రిల్ 24 -- ఇటీవల కాలంలో మలయాళ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా గత నెలలో కూడా విడుదలై మలయాళ ఇండస్ట్రీలోని పలు బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసిన సినిమా ఎల్2 ఎంపురాన్. 2019లో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్ మూవీకి ఎల్2 ఎంపురాన్ సీక్వెల్‌గా తెరకెక్కింది.

ఎంపురాన్ అంటే దేవుడికి తక్కువ.. చక్రవర్తికి ఎక్కువ అనే మీనింగ్ వస్తుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మెయిన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాకు మరో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఎల్2 ఎంపురాన్ మూవీ తెరకెక్కింది. డ్రగ్స్, ఇంటర్నేషనల్ మాఫియా, ఫ్యామిలీ ఎమోషన్స్, రాజకీయాలు వంటి ఇతర అంశాల చుట్టూ ఈ సినిమాను చిత్రీకరించారు.

2019లో లూసిఫర్ సూపర్ హిట్ కావడంతో మూవీ సీక్వెల్‌పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. దా...