భారతదేశం, నవంబర్ 28 -- ఓటీటీలోకి ఇవాళ (నవంబర్ 28) తెలుగు యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే మాస్ జాతర. ధమాకా తర్వాత మాస్ మహారాజా రవితేజ, డ్యాన్సింగ్ క్వీన్ మరోసారి జంటగా నటించిన సినిమా ఇది. దాంతో మాస్ జాతరపై విపరీతమైన హైప్ పెరిగిన విషయం తెలిసిందే.

మాస్ జాతర సినిమాకు రచయిత భాను భోగవరపు దర్శకత్వం వహించారు. తెలుగులో అనేక సినిమాలకు రైటర్‌గా వర్క్ చేసిన భాను భోగవరపు ఈ సినిమాతోనే డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు.

మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాస్ జాతరకు మ్యూజిక్ అందించాడు. మాస్ జాతర సినిమాలో హీరో నవీన్ చంద్ర విలన్‌గా నటించగా.. రాజేంద్రప్రసాద్, నర...