Hyderabad, జూలై 18 -- ఓటీటీలోకి ఇవాళ తెలుగు నుంచి రెండు క్రేజీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఆ రెండు కూడా తెలుగు ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూసిన సినిమాలు. అంతేకాకుండా ఆ రెండు చిత్రాలు మంచి మల్టీస్టారర్ సినిమాలు కావడం విశేషం. ఆ రెండింటిని దాదాపుగా ఈపాటికి అందరూ గెస్ చేసే ఉంటారు. కానీ, మనం ఒక్కో దాని గురించి చెప్పుకుంటూ పోదాం.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన రెండు తెలుగు సినిమాల్లో ఒకటి కుబేర. క్రైమ్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామా జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ బిలీనియర్ లక్ష కోట్ల స్కామ్ చేయడం, దాన్ని వైట్ మనీగా మార్చేందుకు బినామీగా నలుగురు బిచ్చగాలను వాడుకోవడం వంటి స్టోరీతో ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.

ఫ్యామిలీ అంతా కలిసే చూసే సినిమాలను తెరకెక్కించిన పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేర సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ స్ట...