Hyderabad, మే 29 -- ఓటీటీలోకి ఇవాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వచ్చేసింది. సాధారణంగా సూపర్ హిట్ అయిన సినిమాలు నెల దాటిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. కానీ, ఈ మూవీ మాత్రం రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నప్పటికీ నెల రోజులు కాకముందే ఓటీటీ రిలీజ్ అయిపోయింది.

ఆ సినిమానే నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా హిట్ ది థర్డ్ కేస్ వచ్చింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అయినప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. దాంతో సినిమా కోసం ఎంతగానే ఆడియెన్స్ ఎదురుచూశారు. అనుకున్నట్లుగానే మే 1న థియేటర్లలో హిట్ 3 విడుదలైంది.

సుమారు రూ. 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హిట్ 3 మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి 10కి 7.4 రేటింగ్ తెచ్చుకుం...