Hyderabad, జూలై 27 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ ఆడియెన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంటాయి. ఒక వారంలో 20 నుంచి 40 వరకు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో గురు, శుక్రవారాల్లో అధికంగా ఓటీటీ రిలీజ్‌లు జరుగుతుంటాయి.

ఇక చాలా తక్కువా శని, ఆదివారాల్లో సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి. ఇలా ఇవాళ (జూలై 27) ఓటీటీలోకి ఓ తెలుగు మూవీ వచ్చేసింది. ఆ సినిమా పేరే మేమిద్దరం. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్, జబర్దస్త్ జడ్జ్ ఇంద్రజ ప్రధాన పాత్ర పోషించారు. కూతురు కోసం ఏమైనా చేసే తల్లి పాత్రలో ఇంద్రజ నటించారు.

తెలుగులో డిఫరెంట్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఒకరకంగా చెప్పాలంటే ఇది బోల్డ్ మూవీ అనుకోవచ్చు. ఇద్దరు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ, అమ్మాయి...