భారతదేశం, అక్టోబర్ 30 -- ఓటీటీలోకి ప్రతివారం అంటే రోజుకొకటి చొప్పున ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. అయితే, వారంలో గురు, శుక్రవారాల్లో అధికంగా సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. అలా ఇవాళ కూడా ఐదారు సినిమాల వరకు డిజిటల్ ప్రీమియర్ అయ్యాయి. వాటిలో ఓ సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఆ సినిమా మిస్టర్ షుడాయి. కామెడీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు హర్జోత్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహంబిర్ బాల్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో హర్సిమ్రన్, మ్యాండీ థాకర్, కరంజిత్ అన్మోల్ ప్రధాన పాత్రలు పోషించారు. నిషా బానో, సుఖ్విందర్ చాహల్, మల్కీత్ రౌనీ, నవ్ లెహల్, ఖుషి జౌర తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

గతేడాది జూన్ 21న థియేటర్లలో విడుదలైన మిస్టర్ షుడాయి సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఏకంగా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 9.2 రేటింగ్ సొంతం చేసు...