Hyderabad, జూలై 31 -- ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రతి వారం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఇవాళ (జూలై 31) ఓటీటీలోకి సరికొత్త థ్రిల్లర్ సిరీస్ వచ్చేసింది. ఇవాల్టీ నుంచి ఓటీటీలో సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది నెట్‌వర్క్.

ఈ నెట్‌వర్క్ ఓటీటీ వెబ్ సిరీస్‌లో హీరో శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని, శ్రీనివాస్ సాయి ప్రధాన పాత్రలు పోషించారు. సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, అత్యద్భుత విజువల్స్‌తో మొదటి సన్నివేశం నుంచి చివరిదాకా కట్టిపడేసే ఈ సిరీస్‌కు సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వం వహించారు.

రమ్య సినిమా బ్యానర్‌పై లావణ్య యన్ఎస్, ఎంజి జంగం ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన నెట్‌వర్క్ ట్రైలర్‌ ఈ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలను...