భారతదేశం, ఆగస్టు 10 -- ఓటీటీలోకి ప్రతివారం సరికొత్త కంటెంట్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. వీటిలో తెలుగు ఒరిజినల్ కంటెంట్ మూవీస్ కూడా బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది తెలుగు రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మూవీ దొరికిన ప్రేమలేఖ.

ప్రముఖ టాలీవుడ్ యాంకర్ స్రవంతి చొక్కారపు, యూట్యూబ్ సిరీస్‌లతో క్రేజ్ తెచ్చుకున్న విరాజిత, సిద్ధు దివాకర్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితోపాటు జయరాజ్, అఖిల్ గొల్ల, రోహిత్ భరద్వాజ్ అద్దంకి, మాస్టర్ హనువీర్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

షో రన్నర్, స్క్రీన్ ప్లే బాధ్యతలను యాటా నిర్వహించగా కొండ రాంబాబు దర్శకత్వం వహించారు. సాయి సత్య గట్రెడ్డి కథ అందించారు. ఇక మిక్కిన్ అరుల్ సంగీతం అందించిన దొరికన ప్రేమలేఖ సినిమా కథ భార్య, ప్రియురాలు, భర్త ముగ్గురు చుట్టూ సాగుతుందని తెలుస్తోంది....