Hyderabad, జూలై 19 -- ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు ప్రతి వారం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. అయితే, థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల లేదా 20 ఇలా కొన్ని రోజుల్లో ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. కానీ, థియేటర్లలో విడుదలైన మరుసటి రోజే ఓటీటీలోకి రావడం చాలా అరుదైన విషయం. అలాంటిదే తాజాగా ఈ సినిమాకు జరిగింది.

ఆ సినిమానే డీఎన్ఏ. తమిళంలో మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరెక్కిన సినిమా డీఎన్ఏ. అథర్వ మురళి (గద్దలకొండ గణేష్ ఫేమ్), నిమిషా సజయన్ హీరో హీరోయిన్స్‌గా నటించగా.. రమేష్ తైలాక్ (టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్), మొహమ్మద్ జీషన్ అయూబ్, రిత్విక, విజి చంద్రశేఖర్, బోస్ వెంకట్, బాలాజీ శక్తివేల్ తదతరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన డీఎన్ఏ తమిళంలో జూన్ 20న థియేటర్లలో విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంది. సూపర్ హిట్ థ్రిల్లర్‌గాపేరు...