Hyderabad, జూన్ 27 -- ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తూ అలరిస్తుంటాయి. వాటిలో ఓటీటీ ఆడియెన్స్‌ను ఎక్కువగా ఎంగేజ్ చేసే కాన్సెప్ట్ భయం. అవును, ఓటీటీ హారర్ థ్రిల్లర్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే రెగ్యులర్‌గా ఈ జోనర్‌కు ఇతర అంశాలు యాడ్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తుంటారు దర్శకనిర్మాతలు.

అలా ఇవాళ ఓటీటలోకి వచ్చిన తెలుగు సిరీసే విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ వెబ్ సిరీస్‌కు కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఇదివరకు ఓటీటీలో సూపర్ హిట్ అయిన రెక్కీ వెబ్ సిరీస్ నిర్మాతలు ఈ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్‌ను రూపొందించారు.

ఛాయ్ బిస్కెట్ ఫేమ్ అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ వెబ్ సిరీస్‌ మూఢ నమ్మకాలు,...