భారతదేశం, డిసెంబర్ 13 -- తెలుగులో వైవిధ్యభరితమైన కంటెంట్‌తో ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ (డిసెంబర్ 13) ఓటీటీలోకి తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

2021లో నేరుగా ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు బోల్డ్ కామెడీ సిరీస్ 3 రోజెస్ మంచి సక్సెస్ సాధించింది. అందులో ముగ్గురు గ్లామర్ బ్యూటీలు పాయల్ రాజ్‌‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ రొమాంటిక్ ఫన్‌తో మెప్పించారు. దాంతో ఆ సిరీస్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇప్పుడు తాజాగా అదే కిస్ సీన్లు, బోల్డ్ డైలాగ్స్‌, రొమాన్స్‌తో నాలుగేళ్లకు 3 రోజెస్ సిరీస్ సీక్వెల్ వచ్చేసింది. 3 రోజేస్ సీజన్ 2లో నటించిన హీరోయిన్లను పరిచయం చేస్తూ వదిలిన గ్లింప్స్ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన ఓటీటీ స్ట్రీమింగ్ ట్రైలర్ వరకు మంచి రెస్పాన్స్ తెచ్...