Hyderabad, ఆగస్టు 15 -- ఓటీటీలో వచ్చే ఎన్నో రకాల కంటెంట్‌లో తెలుగు సినిమాలు కూడా వైవిధ్యం చూపిస్తున్నాయి. అన్ని రకాల జోనర్లలో సినిమాలు టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. హారర్, కామెడీ, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్ మాత్రమే కాకుండా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను సైతం తెలుగు దర్శకనిర్మాతలు తెరకెక్కిస్తున్నారు.

ఇలా రీసెంట్‌గా ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన బోల్డ్ సినిమానే వర్జిన్ బాయ్స్. యూత్‌ను అట్రాక్ట్ చేసే లవ్, రొమాంటిక్, కిస్, బోల్డ్ సన్నివేశాలతో సాగిన వర్జిన్ బాయ్స్ సినిమాకు దయానంద్ గడ్డం దర్శకత్వం వహించారు. రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజా దరపునేని ఈ సినిమాను నిర్మించారు.

వర్జిన్ బాయ్స్ సినిమాలో ముగ్గురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నటించడం విశేషం. బిగ్ బాస్ తెలుగు 2 విన్నర్ కౌశల్, బిగ్ బాస్ తెలుగు 6 రన్నరప్ శ్రీహాన్‌తోపాటు బిగ్ బాస్ తెలుగ...