భారతదేశం, డిసెంబర్ 7 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు ప్రతి వారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ తెలుగులో డిఫరెంట్ జోనర్స్‌తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఆదివారం ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ అవుతోంది.

ఇందులో భాగంగానే ఇవాళ (డిసెంబర్ 07) ఓ టాలీవుడ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే ఘటన. తెలుగులో ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ ఘటన మూవీ తెరకెక్కింది. ఇది కేవలం మూడు పాత్రల చుట్టూ సాగే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.

ఘటన సినిమాలో రావణ్ రెడ్డి నిట్టూరు, చాందిని రావు, శ్రీనివాస్ గడ్డం ప్రధాన పాత్రలు పోషించారు. రావణ్, చాందిని రావు లవర్స్‌గా చేయగా.. చాందినికి శ్రీనివాస్ తండ్రి పాత్ర పోషించారు. రిషికేష్వర్ యోగి సమర్పించిన ఘటన సినిమాకు కొత్తపల్లి సురే...