Hyderabad, జూలై 20 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు ప్రతివారం సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఈ వారం కూడా సుమారుగా 30కిపైగా ఓటీటీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఎక్కువగా శుక్రవారం (జూలై 18) ఎక్కువగా 20 వరకు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

ఇక ఇవాళ (జూలై 20) ఓటీటీలోకి తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. ఆ సినిమానే నగుమోము కనలేని. ఈ మూవీలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి తండ్రి పాత్రలో నటించాడు. ఆయనతోపాటు శరణ్య శర్మ, ఇందుమతి, రాజా చెంబోలు, ఫణి ప్రకాష్, నెహల్, జయ పరమేశ్వరన్, సుస్మిత, శ్రీనివాస్, రాజు, కిశోర్, సందీప్ ఇతర పాత్రలు పోషించారు.

నగుమోము కనలేని సినిమాను తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం, భావోద్వేగాలతో ఎమోషనల్‌గా మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారు డైరెక్టర్ అనురాధ. లేడి దర్శకురాలు తెరకె...