Hyderabad, జూన్ 13 -- ఓటీటీలో ఎప్పటికప్పుడు వివిధ రకాల జోనర్లలో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో ఓటీటీ మూవీస్ ప్రీమియర్ అవుతుంటాయి. అలా ఈ వారం దాదాపుగా 30కిపైగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఇవాళ ఒక్కరోజే 20కిపైగా ఓటీటీ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

వాటిలో తమిళ, మలయాళ సూపర్ హిట్ మూవీ కూడా ఉంది. తమిళంలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా యుగి. దీన్ని మలయాళంలో అదృశ్యంగా విడుదల చేశారు. తమిళంలో యుగి సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాకు జాక్ హరీస్ దర్శకత్వం వహించారు.

ఈ తమిళ సినిమా యుగిలో తెలుగు హీరోయిన్ ఆనంది కీలక పాత్ర పోషించింది. అలాగే, యుగి మూవీలో కాథిర్, షరఫ్ యు దీన్, పవిత్ర లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించగా ఆత్మీయ రజన్, ప్రతాప్ పోతెన్, జాన్ విజయ్, నరైన్, నట్టి సుబ్రమణ్...