Hyderabad, సెప్టెంబర్ 25 -- ఓటీటీలో ఇవాళ ఒక్కరోజు ఐదు సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అయ్యాయి. వాటిలో ఒకటి తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, చౌపల్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో నేడు స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఇంగ్లీష్‌లో తెరకెక్కిన డాక్యుమెంటరీ సిరీస్ కొకైన్ క్వార్టర్‌బ్యాక్: సిగ్నల్-కాలర్ ఫర్ ది కార్టల్. ఇది డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ సాగుతుంది. యూఎస్సీ కాలేజీ ఫుట్‌బాల్ చాంపియన్ నుంచి సరఫరా అయ్యే అత్యంతకర ప్రమాదమైన డ్రగ్ కార్టెల్ నేపథ్యంతో తెరకెక్కింది. ఈ డాక్యుమెంటరీ అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ్టీ నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇటీవల కాలంలో సెలబ్రిటీల టాక్ షోలు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. అలా తాజాగా ఓటీటీలోకి వచ్చిన సెలబ్రిటీ టాక్ షోనే టూ మచ్ విత్ కాజోల్ అండ్...