భారతదేశం, అక్టోబర్ 30 -- ఓటీటీలోకి ప్రతివారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ అయి ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. ఈ వారం కూడా ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అయితే, వీటిలో ఇవాళ (అక్టోబర్ 30) ఒక్కరోజే ఐదు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయ.

వాటిలో ఒక్కటి మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్, హంగామా, చౌపల్ ప్లాట్‌ఫామ్స్‌లలో నేటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

తమిళంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా బ్లాక్ మెయిల్. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో తేజు అశ్విని, చంద్రిక రవి, బిందు మాధవి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ఈ సినిమాలో మరో హీరో శ్రీరామ్ కూడా యాక్ట్ చేశాడు. రమేష్ తి...