భారతదేశం, నవంబర్ 27 -- ఓటీటీలోకి ఈ వారం అనేక సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటిలో ఇవాళ ఒక్కరోజు రెండు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. రెండు రొమాంటిక్ కామెడీ జోనర్స్ అయినప్పటికీ భిన్నమైన కథలతో ఈ సినిమాలు తెరకెక్కాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం సన్నీ సంస్కారి కీ తులసి కుమారి. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, బ్యూటిఫుల్ జాన్వీ కపూర్, సాన్య మల్హోత్రా, రోహిత్ సురేష్ షరఫ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు.

అక్టోబర్ 02న థియేటర్లలో విడుదలైన సన్నీ సంస్కారి కీ తులసి కుమారి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. సినిమాలోని కామెడీ బాగానే ఉందని టాక్ వచ్చింది. ఫలితంగా ఐఎమ్‌డీబీ నుంచి ...