భారతదేశం, నవంబర్ 9 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తూనే ఉంటాయి. వచ్చే వారం కూడా సరికొత్త సినిమాలు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఈ వారం ఓటీటీల్లో చాలా వరకు మూవీస్ డిజిటల్ ప్రీమియర్ అయ్యాయి. వాటిలో ఎక్కువగా ఫ్రైడే రోజున ఓటీటీ రిలీజెస్ అయ్యాయి.

ఇదిలా ఉంటే, ప్రతి ఆదివారం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే తెలుగు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ వారం అంటే ఇవాళ (నవంబర్ 9) కూడా స్వచ్ఛమైన తెలుగు సినిమా ఓటీటీ రిలీజ్ అయింది. ఆ మూవీనే విజయ్ కేరాఫ్ రామారావు.

ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాశి ముఖ్య పాత్ర పోషించింది. విజయ్ కేరాఫ్ రామారావులో రాశి తల్లిగా, కూతురిగా, భార్యగా యాక్ట్ చేసింది. ఈ మూవీలో రాశితోపాటు శంకర్ మహంతి, మహేంద్ర గణచారి, మేఘన, పీవీఎన్ కార్తికేయ కీలక పాత్రలు పోషించారు.

ఉదయ్ కుమార...