భారతదేశం, జనవరి 9 -- ఓటీటీలోకి శుక్రవారం (జనవరి 9) వచ్చిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లలో ఒకటి ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2. గతంలో వచ్చిన తొలి సీజన్ కు ఇది సీక్వెల్. తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్ రెండో సీజన్ ఎలా ఉంది? ఇందులో ఏం చూపించారు అనేది ఇక్కడ చూడండి.

వెబ్ సిరీస్: ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2

ప్లాట్‌ఫామ్: సోనీ లివ్ (Sony LIV)

నటీనటులు: సిద్దాంత్ గుప్తా, చిరాగ్ వోహ్రా, రాజేంద్ర చావ్లా, ఆరిఫ్ జకారియా తదితరులు.

క్రియేటర్: నిఖిల్ అద్వానీ

బ్రిటీష్ రాజ కుటుంబంపై వచ్చిన 'ది క్రౌన్' (The Crown) సిరీస్‌తో 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్'ను తరచుగా పోలుస్తుంటారు. కానీ భారత దేశ చరిత్రను డీల్ చేయడం చాలా కత్తి మీద సాము లాంటిది. ఇక్కడ నాయకులను కొందరు దేవుళ్లుగా...