భారతదేశం, నవంబర్ 21 -- స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి చియాన్ విక్రమ్ నట వారసుడుగా ఆయన కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం బైసన్.

ధృవ్ హీరోగా తెరకెక్కిన బైసన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. పల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామర్ లుక్‌లో అనుపమ పరమేశ్వరన్ అట్రాక్ట్ చేసింది. అనుపమతోపాటు మరో హీరోయిన్ రజీషా విజయన్ కీలక పాత్ర పోషించింది.

అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్స్‌పై బైసన్ చిత్రాన్ని నిర్మించారు. బైసన్ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 17న తమిళనాడులో బైసన్ కాలమాదన్ (Bison Kaalamaadan) టైటిల్‌తో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది.

బైసన్ సినిమాపై ప్రశంసలు కురిశాయి. అం...