భారతదేశం, డిసెంబర్ 12 -- ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలపై సినీ లవర్స్ అమితమైన ఆసక్తి చూపిస్తుంటారు. వారి అభిరుచికి తగినట్లుగానే ఓటీటీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ ప్రతి వారం రిలీజ్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఓటీటీలోకి సరికొత్త మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది.

ఆ సినిమానే తీయావర్ కులైగల్ నడుంగ (Theeyavar Kulaigal Nadunga). యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇది. 'తీయావర్ కులైగల్ నడుంగ' థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుని ఓటీటీలోకి వచ్చేసింది.

విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో జరిగిన హత్య చుట్టూ తిరిగే ఈ ఇంటెన్స్ మర్డర్ మిస్టరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఎంతో అనుభవం గల ఇన్‌స్పె...