Hyderabad, జూన్ 6 -- ఈ వీకెండ్ మంచి మర్డర్ మిస్టరీ చూడాలనుకుంటున్నారా? అయితే శుక్రవారం (జూన్ 6) జీ5 ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ మిస్ కావద్దు. మరీ అంత థ్రిల్ పంచకపోయినా.. హత్య ఎవరు చేశారన్న సస్పెన్స్ మాత్రం మొదటి నుంచీ చివరి వరకూ కొనసాగుతుంది. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ఛల్ కపట్ (Chhal Kapat).

ఛల్ కపట్ ఓ హిందీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనర్థం మోసం అని. ఇది మధ్యప్రదేశ్ లోని బురాన్‌పూర్ అనే ఊళ్లో జరిగే కథ. అలీషా, షాలు, ఇరా, మెహక్ అనే నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. సిరీస్ మొదట్లోనే షాలు చనిపోయినట్లుగా చూపిస్తారు. అలీషా పెళ్లి వేడుకల కోసం వచ్చిన ఆమె అనుమానాస్పద పరిస్థితుల్లో నీటిలో మునిగి చనిపోతుంది. అప్పుడే ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్పీ దేవికా రాథోడ్ (శ్రియా పిల్గావ్‌కర్) ఈ కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దిగుతుంది.

షాలూ చనిపోయిన సమయంలో 9 ...