Hyderabad, అక్టోబర్ 12 -- ఓటీటీలోకి తెలుగు కంటెంట్ సినిమాలు ఎక్కువగానే వస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్, లవ్ రొమాంటిక్ వంటి జోనర్స్‌తోపాటు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే థ్రిల్లర్స్‌ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా తాజాగా ఇవాళ (అక్టోబర్ 12) ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు సస్పెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా మాస్క్.

నివాస్ అనే వ్యక్తి డెలివరి ఏజెంట్‌గా పని చేస్తాడు. బతకడం కష్టంగా మారడంతో ఓ వృద్ధ జంట ఉన్న ఇంట్లోకి దొంగతనానికి వెళ్తాడు నివాస్. కానీ, తీరా దొంగతనానికి వెళ్లిన నివాస్‌కు అక్కడ ఆడ శవం కనిపిస్తుంది. దాంతో భయంతో వణికిపోయి ఆమెను లేపడానికి ట్రై చేస్తాడు. కానీ, ఊహించని విధంగా శవంతో నివాస్ ఉన్న రూమ్‌కి లాక్ పడుతుంది.

అర్ధరాత్రి నుంచి తెల్లారే వరకు ఆడ శవంతో గదిలో ఇరుక్కుపోతాడు నివాస్. మరుసటి రోజు ఉదయం నివాస్‌ను పోలీసులు అర...