భారతదేశం, జనవరి 15 -- కొత్త వారం రాగానే ఓటీటీలోకి సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇవాళ (జనవరి 15) తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే ఇట్లు మీ ఎదవ. వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిళ్లు అనేది సినిమా క్యాప్షన్.

డిఫరెంట్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో త్రినాధ్ కఠారి హీరోగా చేయడంతోపాటు స్వీయ దర్శకత్వం వహించారు. అంటే హీరో, డైరెక్టర్ రెండు త్రినాధ్ కఠారి ఒక్కరే నిర్వర్తించారు. ఈ సినిమాలో త్రినాధ్‌కు జోడీగా సాహితీ అవాంచ హీరోయిన్‌గా చేసింది.

అలాగే, ఇట్లు మీ ఎదవ సినిమాలో గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, తనికెళ్ల భరణి, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి కీలక పాత్రలు పోషించారు. వీరితోపాటు తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగ...