Hyderabad, సెప్టెంబర్ 7 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. అయితే, నిజమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సినిమాలు రావడం చాలా అరుదుగా మారింది. కానీ, ఇటీవల కాలంలో తెలుగులోనూ విభిన్నమైన కంటెంట్‌తో సినిమాలు వస్తున్నాయి. అలాగే, స్వచ్ఛమైన భావోద్వేగాలతో తెలుగు ఓటీటీ సినిమాలు అలరిస్తున్నాయి.

ప్రతి వారం ఒక డిఫరెంట్ ఎమోషన్స్‌తో తెలుగు సినిమాలను స్ట్రీమింగ్ చేస్తోంది ఓ ప్లాట్‌ఫామ్. ఈ క్రమంలోనే ఇవాళ (సెప్టెంబర్ 7) మరో ఎమోషనల్ థ్రిల్లర్ సినిమాతో ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చింద సదరు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్. ఆ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్.

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఈటీవీ విన్ కథా సుధా మినీ సిరీస్‌తో ప్రతి ఆదివారం సరికొత్త సినిమాతో వస్తుంది. ఈటీవీ విన్ కథా సుధాలో భాగంగా ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన సినిమా మౌనమే నీ భాష...